తెలంగాణ రెండవ వేతన సవరణ కమిషన్ కు ల్యాబ్ టెక్నీషియన్స్ వేతన పెంపుదల కోరుతూ విన్నపం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ తరపున కమీషనర్, తెలంగాణ రెండవ వేతన సవరణ కమిషన్ కు ల్యాబ్ టెక్నీషియన్స్ క్యాడర్ తరపున వేతన పెంపుదల కోరుతూ విన్నవించారు. ముఖ్యంగా గత వేతన సవరణల్లో జరిగిన ల్యాబ్ టెక్నీషియన్స్ క్యాడర్ కి జరిగిన అన్యాయాలని పూర్తిస్థాయిలో విచారించి న్యాయం జరిగేలా చూడాలని కోరడం జరిగింది.
ముఖ్యంగా ల్యాబ్ టెక్నీషియన్లకు వృత్తిపరంగా ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల కలిగే జీవిత కాల ఆరోగ్య ప్రమాదాలకై అలవెన్సులను మంజూరీ చేయుటకై మరియు వైద్యవిద్యా అలవెన్సులకై ప్రత్యేక అలవెన్సు మంజూరీ చేయు విషయం పై, విద్యార్హతల వివరాలతో పాటు మనం కలిగి ఉన్న వృత్తి నైపుణ్యత విషయాలను కూలంకషంగా వేతన సవరణ కమీషన్ ముందు ఉంచడం జరిగింది.
వేతన సవరణ కమీషనర్ దాదాపు 45 నిమిషాల సమయాన్ని ల్యాబ్ టెక్నీషియన్ క్యాడర్ సమస్యల విన్నపానికై మన TSGMLTA అసోసియేషన్ కి కేటాయించినందులకు, సమస్యల పరిష్కారమై సానుకూలత తెలిపినందులకు కమీషనర్ కి ప్రత్యేక ధన్యవాదాలుతెలిపారు.
కార్యక్రమంలో అధ్యక్షులు హరినాథ్, ప్రధాన కార్యదర్శి మంచాల రవీందర్, కోశాధికారి రాజేందర్, ఉపాధ్యక్షులు మహ్మద్ సలీం, కార్యదర్శి రమేష్, బురాన్, వేణుగోపాల్, భాస్కర్, సునీత మరియు ప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *