ఒంగోలులో దివ్యాంగ విద్యార్థులకు 12 లాప్ టాప్ లు,వయో వృద్దులకు 18 శ్రవణ యంత్రాలు పంపిణీ.

ప్రకాశం జిల్లాకు చెందిన డిగ్రీ, మరియు ఆ పై కోర్సులు చదువుతున్న 12 మంది దివ్యాంగ విద్యార్థులకు లాప్ టాప్ లు మరియు 18 మంది వయోవృద్ధులకు శ్రవణ యంత్రములను మరో ఇద్దరు వయో వృద్ధులుకు గుర్తింపు కార్డులను సోమవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఐఏఎస్ మరియు జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ ఐఏఎస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. జిల్లా విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ జిల్లా మేనేజర్ జి. అర్చన ఆధ్వర్యములో కలెక్టరేట్లోని స్పందన హాలులో వీటిని లబ్దిదారులుకు అందచేశారు.ఈ సందర్భంగా జి అర్చన మాట్లాడుతూ… ఒక్కొక్క లాప్టాప్ రూ. 35,000 చొప్పున 12లాప్ టాప్ లు రూ.4,20,000లు, అదేవిధంగా ఒక్కొక్క శ్రవణయంత్రం రూ.5000/- చొప్పున 18 శ్రవణ యంత్రములు రూ.90వేలు, వెరసి రూ .5,10,000లు విలువైన ఈ ఉపకరణాలను లబ్ధిదారులుకు ఉచితంగా అందజేసినట్లు ఆమె చెప్పారు. వీటిని సద్వినియోగం చేసుకోవల్సినదిగాకలెక్టర్ ఎ.ఎస్ దినేష్ కుమార్ సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *