ఫ్రీ-మెట్రిక్ ఉపకార వేతనములకు దరఖాస్తులు ఆహ్వానం- ఎప్రియల్ 10లోపు నవశంకం లాగిన్లో నమోదు కావాలి -జిల్లా ఎస్సీ సంక్షేమశాధికారి ఎన్ లక్ష్మానాయక్

ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 2023-24 సంవత్సరంనకు సంబంధించి ఫ్రీ మెట్రిక్ ఉపకార వేతనములు మంజూరు చేయటకు సచివాలయంలో నవశకం లాగిన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమశాధికారి ఎన్ లక్ష్మానాయక్ కోరారు. ఈ పథకంలో మాఉ్యవల్ స్కావెంజర్స్, టీనర్స్ మరియు ప్లేయేర్స్ (చర్మము తీయువారు మరియు తోళ్లు శుద్ది చేయువారు) వేస్ట్ పిక్కర్స్ (వ్యర్థ పదార్ధములు సేకరించువారు), హజార్దన్ క్లీనింగ్ (భూగర్భ పైపు లైన్స్ శుభ్రం చేయువారు) వారి పిల్లలను 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుకొని విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకు ఏ కులమునకు చెందిన వారైన సరే సంబంధిత వత్తులు చేయువారికి ఉపకార వేతనములకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లభించు ఉపకార వేతనములు ఒకటి నుండి 10వ తరగతి వరకు డే- స్కాలర్సు రూ. 3వేలు, హాస్టలర్స్కు మూడు నుండి పదవ తరగతి వరకు రూ. 8వేల రూపాయలు మంజూరు చేయటం జరుగుతుందని చెప్పారు. జిల్లాలో సచివాలయం ద్వారా సంబంధిత వేల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వార్డ్ ఎడ్యుకేషన్ లేదా ప్రాసెసింగ్ సెక్రటరీ ద్వారా నవశకం లాగిన్ నందు ఎప్రియల్ 10లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. నమోదు అయిన దరఖాస్తులకు ఎప్రియల్ ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమీషనర్లు ఎప్రియల్ 20లోపు ఆమోదించాలని చెప్పారు. జిల్లాలో అర్హత కలిగిన ప్రతి యొక్క విద్యార్థి ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా తల్లిదండ్రులు చూడాలని కోరారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *