కంటోన్మెంట్ నియోజక వర్గంలో ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ ఎన్నికల్లో పార్లమెంట్ మరియు కంటోన్మెంట్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని శ్రీ గణేష్ కోరారు.కంటోన్మెంట్ వార్డ్ -5 లోని 2 లక్ష్మి నగర్, సంజీవ నగర్ బాయిగడ్డ, వాల్మీకి నగర్ లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు, మహిళా నాయకులు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


