మాట తప్పని మడమ తిప్పని సీఎం వైఎస్ జగన్మో హన్ రెడ్డి అంటే పేద ప్రజలకు ఒక నమ్మకం, ఒక ధైర్యం అని • వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద రెడ్డి అన్నారు. దర్శి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాల యంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, బూచేపల్లి శివప్రసాదరెడ్డిలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫె స్టోను ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతలా భావిస్తారని చెప్పారు. అందుకే గతంలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన దేశంలో ఒకే ఒక్క సీఎంగా జగనన్న నిలిచారన్నారు. చేయగలిగిందే జగనన్న చెప్తారని, అబద్ధాలు చెప్పి ఓట్లేయించుకోవడం వైఎస్సార్ సీపీ నైజం కాదన్నారు. ప్రస్తుతం అమలు చేసిన నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో ప్రజ లందరికీ గ్రామీణ ప్రాంతాల్లో సైతం మా
నమ్మకం నువ్వే జగన్ అంటూ మళ్లీ జగనన్నే సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. జిల్లా పరిషత్ చైర్పర బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ… చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడల్లా చేసినది దోచుకోవడం, దాచుకో మేనన్నారు. కరోనా వచ్చి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు హైదరాబాదులో దాక్కుని ఎన్నికలు వచ్చే సరికి కట్ట కట్టుకొని పొత్తులు పెట్టుకుని మళ్లీ ఏపీకి వచ్చిన చంద్రబాబు కు, ఎన్డీఏ కూటమికి… రానున్న ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ది చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. సమావేశం మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ షకీలా అమీన్బాషా, వైఎస్ఆర్సిపి రాష్ట్ర రైతు విభాగం ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి (మహేష్), గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ క్టర్ కుమ్మిత అంజిరెడ్డి, నెడ్కాప్ డైరెక్టర్ సానికొమ్ము తిరుపతి రెడ్డి , వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ కేవీరెడ్డి, మాజీ సర్పంచ్ చంద్రగిరి గురవారెడ్డిపాల్గొన్నారు.
జగన్ అంటే..నమ్మకం!మాట తప్పని నేత జగనన్న-నాడు-నేడుతో పాఠశాలల అభివృద్ధి-అమ్మఒడితో అక్షరాస్యత శాతం పెంపు-కావు నేస్తంతో కాపులందరికీ న్యాయం -అన్నీ వర్గాలకు ఆమోదమైన మేనిఫెస్టోనవరత్నాల ప్లస్-డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ
29
Apr