సికింద్రబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ ను భారీ మెజార్టీ తో గెలిపించుకుంటామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విశాల్ సుదామ్ అన్నారు.మంగళవారం దానం నాగేందర్ నివాసం లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం లో
ఏ ఐ సి సి తెలంగాణా ఇంఛార్జి దీపా దాస్ మున్షీ.అభ్యర్థి దానం నాగేందర్ తో పాటు విశాల్ సూదాం కూడా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలో పలు అపార్ట్మెంట్ ల వాసులు ,బస్తీల వాసులు దానం నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు .ఇంటింటి పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు.ప్రతి ఒక్కరూ దానం నాగేందర్ కు హస్తం గుర్తు పైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విశాల్ సుధామ కోరారు.
