వైఎస్సార్పీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు పేదలకు వరాలు అని ఒంగోలు 48వ డివిజన్ వైఎస్సార్సీపీ నాయకులు వివరించారు. డివిజన్ పరథిలో దిబ్బల రోడ్, రమణారావు హాస్పటల్ ప్రక్క రోడ్డు, అయ్యన్న వీధి తదితర వీధులలో వైఎస్సార్సీపీ డివిజన్ ఇన్చార్జిలు శేషిరెడ్డి, కోఆర్డినేటర్ నరేంద్ర రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు వీర భద్రరావు (వీరు), ఉన్నం జనార్ధన్, మాధవ, హనుమా, నాగరాజు, బాదులు, వెంకటేష్, రాము, మధు, నాగేశ్వరావు, సుధాకర్, రాఘవయ్య, జాణా శ్రీను, గురువా రెడ్డి, స్టీఫెన్, జానీ, చిరంజీవి, కొప్పొలు వెంకటేశ్వర్లు, జ్యోతి, మాధవి, మల్లెశ్వరి, వాకా బ్రహ్మా రెడ్డి, రామక్రిష్ణా రెడ్డి, సత్తి రెడ్డి తదితరులు తిరిగి కోవిడ్ సమయంలో ఎవరూ ఆదుకోని సమయంలో డిబీటి ద్వారా ప్రభుత్వం ఆదుకుందని, స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేసారని గుర్తు చేసారు. తిరిగి ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాస రెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా చెవి రెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి, వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు





