రాష్ట్రంలో జనము మెచ్చె పాలన సీఎం వైఎస్ జగనన్నతోనే సాధ్యమని వైఎస్సార్సీపీ డివిజన్ ఇన్చార్జిలు, నాయకులు అన్నారు. పట్టణంలో పలు డివిజన్లలో బుధవారం ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాస రెడ్డిని, ఎంపీ అభ్యర్థి చెవి రెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. 44వ డివిజన్లో ఇన్చార్జి నరసింహా రెడ్డి, కోఆర్డినేటర్ సతీష్, డివిజన్ అధ్యక్షుడు, కార్పోరేటర్ గోపి రెడ్డి గోపాల్ రెడ్డి నాయకులు ఉదయగిరి క్రిష్ణ. మోతడిక అంకయ్య, గడివేముల అంకయ్య, పునుగోటి రాజేశ్వరి, టి శ్రీనివాస రెడ్డి, పెద్ది రెడ్డి, కూరేటి బాల నాగేష్, శంకర్ రెడ్డి, శివయ్య తదితరులు పాల్గొని ఒంగోలులో వాసన్న చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించే పత్రాలు అందించారు.



