రాష్ట్రంలో జనము మెచ్చె పాలన సీఎం వైఎస్ జగనన్నతోనే సాధ్యమని వైఎస్సార్సీపీ డివిజన్ ఇన్చార్జిలు, నాయకులు అన్నారు. పట్టణంలో పలు డివిజన్లలో బుధవారం ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాస రెడ్డిని, ఎంపీ అభ్యర్థి చెవి రెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.45వ డివిజన్ ఇన్చార్జి నితిన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పల్నాటి రవీంద్ర రెడ్డి, కార్పోరేటర్ వెన్నపూస కుమారి వెంకటేశ్వర రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస రెడ్డి, గురువా రెడ్డి, కొండా రెడ్డి తదితరులు పాల్గొని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాస రెడ్డిని, ఎంపీ అభ్యర్థికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యధికంగా ఓట్లు వేయించి, వేసి గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.

