దానం కి మద్దతు తెలిపిన సింధీ భవన్,సిల్వర్ జూబ్లీ అపార్ట్ మెంట్ వాసులు.

కాంగ్రెస్ సీనియర్ నాయకులు షేక్ గౌస్ నీ సన్మానించి న అపార్ట్మెంట్ వాసులు.
దానం నాగేందర్ నీ గెలిపించండి.సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దానం నాగేందర్ కు తమ మద్దతు తెలియ జేశారు సింధీ భవన్,సిల్వర్ జూబ్లీ అపార్ట్మెంట్ వాసులు.బుధవారం సనత్ నగర్ నియోజక వర్గం మాజీ ఏ బ్లాక్ ,బీ బ్లాక్ అధ్యక్షులు షేక్ గౌస్ ఆధ్వర్యం లో పీ జీ రోడ్ సింధీ భవన్ ,సిల్వర్ జూబ్లీ అపార్ట్ మెంట్ వాసులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రాధాన్యతా క్రమంలో అమలు చేస్తుందన్నారు.పార్లమెంట్ కి జరుగుతున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ కు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ఆమె వారిని కోరారు.సనత్ నగర్ మాజీ ఏ బ్లాక్,బీ బ్లాక్ అధ్యక్షులు గా పనిచేసిన షేక్ గౌస్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ఈ సమావేశం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ నీ గెలిపించాలని.ఆమె వారిని కోరారు.అలాగే సమస్యలు వుంటే గౌస్ ద్వారా తన దృష్టికి తీసుకురావాలని. ఆ సమస్యలను తప్పక పరిష్కరించేలా చూస్తానని కోట నీలిమ వారికి హామీ ఇచ్చారు.షేక్ గౌస్ మాట్లాడుతూ సింది భవన్.,సిల్వర్ జూబ్లి అపార్ట్ మెంట్ అసోసియేషన్ వాసులతో తనకు 30ఏళ్ల అనుబంధం వుందన్నారు.దానం కు ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా షేక్ గౌస్ ను అసోసియేషన్ ల ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ తమ ప్రాంతం లో వున్న పార్క్ లో మౌలిక సదుపాయాలు లేవని. ఈ పార్క్ వద్ద ఇతర ప్రాంతాలకు చెందిన వారు తమ వాహ నాలను పార్కింగ్ చేస్తూ తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని,సమస్యను పరిష్కరించాలని వారు కోట నీలిమ ను కోరారు.అలాగే సిల్వర్ జూబ్లీ అపార్ట్ మెంట్ సమీపం లో వున్న జమాత్ ఖానా మజీద్ కు నీళ్ళు మాత్రం రావడం లేదని.కరెంటు బిల్లు మాత్రం వస్తుందన్నారు.తమకు ఉచిత నీటి కుళాయి కనెక్షన్ వద్దని నీళ్ళు ఇప్పిస్తే బిల్లు కట్టుకుంటామని వారు నీలిమకి వివరించారు.అలాగే వర్షాలు కురిసిన సమయంలో ఈ ప్రాంతం లో రెండు అడుగుల మేర నీరు నిలిచిపోయి తమకు ఇబ్బందిగా మారుతుందని.సమస్యను పరిష్కి రించాలని కోరారు .వీధి లైట్లు కూడా లేవని.వేయించాలని కోరారు. ఈ సమావేశం లో సింధీ భవన్ అసోసియేషన్ అధ్యక్షులు దీపక్ ఎమ్ దాస్,వినోద్ మట్టా,కరణ్ పర్యాని,సునీల్ పర్యాణి,సిల్వర్ జూబ్లి అపార్ట్ మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోయిస్ బిసాయ్,యూసఫ్ లఖాని,అమీన్ నోరాని ,అజీజ్ జీవాని తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *