రాష్ట్రంలో జనము మెచ్చె పాలన సీఎం వైఎస్ జగనన్నతోనే సాధ్యమని వైఎస్సార్సీపీ డివిజన్ ఇన్చార్జిలు, నాయకులు అన్నారు. పట్టణంలో పలు డివిజన్లలో బుధవారం ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాస రెడ్డిని, ఎంపీ అభ్యర్థి చెవి రెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.50వ డివిజన్లో వైఎస్సార్సీపీ బలపరచిన అభ్యర్థులను గెలిపించాలని డివిజన్ ఇన్చార్జి ప్రసాద్ రెడ్డి, కార్పోరేటర్ ఎ ప్రసాదరావు, డివిజన్ అధ్యక్షుడు జె సురేష్ ఆధ్వర్యంలో కొండలు, మారుతి, వేణు, రవి, కోటి, ప్రణీత్ రెడ్డి తదితరులు ఒంగోలు అభివృద్దికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డిని, ఎంపీ అభ్యర్థి చెవి రెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్జీలతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.




