మంచి చేసే ప్రభుత్వానికి అండగా నిలవండి 47వ డివిజన్లో ప్రచారం నిర్వహించిన బాలినేని శ్రీనివాస రెడ్డి కోడలు శ్రీకావ్య

పేదలందరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే మామయ్య బాలినేని శ్రీనివాస రెడ్డి ఎంతో మేలే చేసారని… ఈ ఎన్నికల్లో వారికి అండగా నిలవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య కోరారు. 47వ డివిజన్లో గురువారం ఆమె స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఒంగోలు నియోజక వర్గ అభివృద్ధిని చూసి ప్రతి ఇంటికి జరిగిన మేలును చూసి ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాస రెడ్డికి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. మావయ్య బాలినేని శ్రీనివాస రెడ్డి నివాసం వద్దకు వచ్చి సాయం అడిగిన వారికి లేదనకుండా సాయం చేసే మనసున్న నాయకుడు బాలినేని అని కొనియాడారు. ఆయన గెలుపుతో నిరుపేదలకు మరింత న్యాయం జరుగుతుందని చెప్పారు. ఇంటి వద్దకే పింఛన్లు, రేషన్, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి వంటి అనేక పథకాలు అమలు చేసిన సీఎం వైఎస్ జగన్ కు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైనదని చెప్పారు. ఒంగోలులో ఇళ్లులేని నిరుపేదలకు నివాస స్థలాలు సాధించేందుకు మామయ్య బాలినేని శ్రీనివాస రెడ్డి చేసిన కృషిని వివరించారు. ఎన్నికల అనంతరం 9 నెలలో నివాసాలు సైతం నిర్మించేందుకు కృషి చేస్తారని చెప్పారు. ఎలాంటి సమస్య వచ్చినా బాలినేని కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ముందుగా డివిజన్ అధ్యక్షుడు చావల శ్రీనివాసులు, ఇన్చార్జి చిట్టెంరెడ్డి శ్రీనివాస రెడ్డి , ఇప్పాల శివా రెడ్డి ఆధ్వర్యంలో బూత్ కన్వినర్లు సి సుబ్రమణ్యం, పసుపులేని ఏడుకొండలు, కాంతమ్మ, ముఖ్య నాయకులు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

పిల్లగుజ్జు వేణుమాధవ్(బుజ్జి), అల్లూరయ్య, ఈ సరసింహారావు, సాదా నరసింహారావు, కొప్పొలు వెంకటేశ్వర్లు, దీలీప్కుమార్, వాకా సుబ్బా రెడ్డి, కావేరి ఆనందరావు, లక్ష్మి, పద్మ, మనోజ్ కుమార్, సీహెచ్ బాల మాలకొండయ్య, హరి క్రిష్ణా రెడ్డి, ఎం సునీల్ తదితరులు పూల మాలలు, పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. 47వ డివిజన్లోని సాయిబాబ చిన్న మందిరం వద్ద ప్రత్యేక పూజలు చేసి ప్రచారంలో బాలినేని శ్రీకావ్య పాల్గొన్నారు. ప్రతి అపార్ట్మెంట్, మూడు, నాలుగు అంతస్తులు సైతం ఎక్కి వారిని స్వయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి చేసిన అభివృద్ధి కర పత్రం అందిస్తూ ఎంతో హుసారుగా, ఓర్పుతో ఓట్లు అభ్యర్థించటం ప్రజలలో తీవ్ర చర్చాంశనీయమైనది. మహిళలు ఆమె ఓర్పుకు ఎంతగానో మంత్ర ముగ్ధులౌతున్నారు.

Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *