ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం వైఎస్ జగనన్నను, ఒంగోలు ఎమ్మెల్యే మామయ్య బాలినేని శ్రీనివాస రెడ్డిని మరోసారి గెలుపించుకుని సీఎంగా, ఎమ్మెల్యేగా చేసుకుందామని బాలినేని కోడలు శ్రీకావ్య పిలుపునిచ్చారు. 47వ డివిజన్లో గురువారం పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషి చేసి ప్రభుత్వం చేసిన మంచిని, పేదలను ఆదుకున్న విధానాన్ని బలంగా ప్రజలకు వివరించి మంచి మెజార్టీ సాధించే దిశగా కృషి చెయ్యాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు చావల శ్రీనివాసులు, ఇన్చార్జి చిట్టెంరెడ్డి శ్రీనివాస రెడ్డి, ఇప్పాల శివా రెడ్డి ఆధ్వర్యంలో బూత్ కన్వినర్లు సి సుబ్రమణ్యం, పసుపులేని ఏడుకొండలు, కాంతమ్మ, పిల్లగుజ్జు వేణుమాధవ్(బుజ్జి), సాదా నరసింహారావు, కొప్పొలు వెంకటేశ్వర్లు, దీలీపకుమార్ తదితరులు పాల్గొన్నారు.


