సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ను గెలిపిద్దాం – సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి,తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఏ ఐసీసీ సభ్యురాలు డా. కోట నీలిమ.

సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో వున్న దానం నాగేందర్ ను భారీ మెజార్టీ తో గెలిపించాలని ,సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి,ఏ ఐసీసీ సభ్యురాలు డా. కోట నీలిమ ఓటర్లను కోరారు.గురువారం సనత్ నగర్ నియోజక వర్గం బేగంపేట డివిజన్ పరిధిలోని బ్రాహ్మణ వాడి,ఓల్డ్ కస్టమ్స్ బస్తీ ,భాగవంటా పూర్,వికార్ నగర్,వడ్డెర బస్తీ,ఎన్ బీ టీ నగర్,పాటిగడ్డ,నూర్ బాగ్ లలో సనత్ నగర్ నియోజక వర్గం ఏ బ్లాక్ ,బీ బ్లాక్ మాజీ అధ్యక్షులు షేక్ గౌస్ ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశాల్ సుధామ తదితరులతో కలిసి కోట నీలిమ ఇంటింటి పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.రాష్ట్రం లో అమలవుతున్న ఆరు గ్యారంటీ ల అమలును వివరిస్తూ ఓటర్లను దానం కు చేతి గుర్తు పైన ఓట్లు వేయాలనీ కోరారు.బిజెపి,బీ ఆర్ ఎస్ ఎన్నికల ముందు మోసపూరిత మైన హామీలను ఇచ్చి అందలాన్ని ఎక్కాలనీ చూస్తున్నాయన్నారు.సికింద్రబాద్ పార్లమెంట్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కోట నీలిమ అన్నారు.దానం ను గెలిపిస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో సనత్ నగర్ నియోజక వర్గం ఏ బ్లాక్,బీ బ్లాక్ మాజీ అధ్యక్షులు షేక్ గౌస్,సీనియర్ నాయకులు విశాల్ సుధామ,హనీఫ్ ఖాన్,అయాన్ ఖాన్,శ్రీనివాసరెడ్డి,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

పాదయాత్ర అనంతరం బేగంపేట్ సాయి గణేష్ మందిర్ ను సందర్శించిన డా. కోట నీలిమ

ఈ పాదయాత్ర లో సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *