కోట నీలిమ సమక్షం లో కాంగ్రెస్ పార్టీ లో చేరిన కూన సోదరులు.

సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ,టి పి సీ సీ ప్రధాన కార్యదర్శి, ఏ ఐ సి సి సభ్యురాలు డాక్టర్ కోట నీలిమ సమక్షం లో బేగంపేట బ్రాహ్మణ వాడి కి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూన వెంకటేష్ గాడ్ తనయులు కూన శ్రవణ్ కుమార్ గౌడ్,కూన గౌరీ శంకర్ గౌడ్ లు గురువారం కోట నీలిమ సమక్షం లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా కోట నీలిమ కూన సోదరులకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.అనంతరం వారు బ్రాహ్మణ వాడి లో నిర్వహించిన ఇంటింటి పాదయాత్ర కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూన శ్రవణ్ కుమార్ గౌడ్.గౌరీ శంకర్ గౌడ్ లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం లో రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు.సనత్ నగర్ నియోజక వర్గం లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ వంతు సహాయ సహా కారాలు అందిస్తామని వారు అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *