నిరుపేదల జీవన ప్రమాణాలు పెంచటమే అసలైన అభివృద్ధి అని నమ్మి సంక్షేమ పథకాలను పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం వైఎస్ జగనన్నను ముఖ్యమంత్రిగా, వాసన్నను ఎమ్మెల్యేగా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీగా చేసుకుందామని వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. 50వ డివిజన్లో నెహ్రూ నగర్లో వైఎస్సార్సీపీ బలపరచిన అభ్యర్థులను గెలిపించాలని డివిజన్ ఇన్చార్జి ప్రసాద్ రెడ్డి, కార్పోరేటర్ అంబటి ప్రసాదరావు, డివిజన్ అధ్యక్షుడు జల్లిపల్లి సురేష్, జల్లుపల్లి సుబ్బులు, బేతపూడి రాజేశ్వరి, బేతపూడి భాస్కర రావు, చక్రపాణి, దుర్గా, దాసరి శ్రీదేవి, చప్పిడి శ్రీను, యలమల చక్రపాణి, విజయలక్ష్మి, కళ్యాణి, ధనలక్ష్మి, షర్మిల, సులోచన, సుధారాణి తదితరులు పాల్గొన్నారు. నేతాజీ కాలనీ పరధిలో కార్పోరేటర్ అంబటి ప్రసాద్, ఇన్చార్జి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఓబులు రెడ్డి, కొండలు, వేణు రెడ్డి, మల్లిఖార్జున రెడ్డి, బలరామ్ రెడ్డి, రంగా రెడ్డి, రమాదేవి, కుమారి, మరియమ్మ, మునుస్వామి, జానీ భాష తదితరులు పాల్గొని ఒంగోలు అభివృద్ధికి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డిని, ఎంపీ అభ్యర్థి చెవి రెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీలతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.

