తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరంలో పేకాట ఆడు తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ వైవీ రమణయ్య తెలిపారు. గ్రామంలో ఇళ్ల మధ్యలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం రావడంతో బుధవారం ఆయన తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.6900 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
తూర్పుగంగవరంలో ఇద్దరు జూదరుల అరెస్ట్
21
Dec