విద్యార్థుల భవిష్యతు బంగారు బాటలు వేయడమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని జెడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పేర్కొన్నారు. గురువారం దర్శి బాలికల ఉన్నత పాఠశా లలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ.. తాను బాధ్యతలు స్వీకరించాక దర్శిలో మొదటిసారి ఈ స్కూల్వెకి వచ్చానని గుర్తు చేశారు. ఉపా ధ్యాయులు, విద్యార్థుల కోరిక మేరకు రూ.10 లక్షలతో షెడ్, రూ.2 లక్షలతో సైకిల్ స్టాండ్ నిర్మించడంతోపాటు స్కూల్ గ్రౌండ్ బాగు చేయించానని చెప్పారు. దర్శి మండలంలో 8వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం 1350 ట్యాబ్ లు అందించినట్లు తెలిపారు. విద్యార్థులు ఆర్థిక సమస్య కారణంగా చదు వుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో అమ్మ
వడి, విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్నారన్నారు. మనబడి నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా వేల కోట్లు ఖర్చు చేసి పాఠశాలల రూపురేఖలు మార్చారన్నారు. గత ప్రభుత్వంలో కనీసం యూనిఫాం కూడా ఇవ్వలేదని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే జగనన్న విద్యా కానుక అందించిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలుఅధిరోహించాలని ఆకాంక్షించారు. ముందుగా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సతీమణి నందిని, కురిచేడు జెడ్పీటీసీ నుసుం నాగిరెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, ఎంఈఓ రమాదేవి, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రామాంజనేయులు, హెచ్ ఎం ఖాదర్ మస్తాన్, కేవీజీ కీర్తి తదితరులు పాల్గొన్నారు.


