గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ ఆర్ధిక ఇబ్బందుల కారణంగా సరైన వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబానికి మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అండగా నిలిచారు. బాధితుడి వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి ఆర్ధిక సహాయం నుండి మంజూరైన 2 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం మంజూరు పత్రాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. అమీర్ పేట డివిజన్ BJJR నగర్ కు చెందిన నిమ్మ అనిల్ కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ వైద్యుల వద్దకు చికిత్స కోసం వెళ్ళారు. అనిల్ కు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని, అందుకు భారీగానే ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో అనిల్ కుటుంబ సభ్యులు మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి సహకారంతో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి తమ పరిస్థితిని వివరించి వైద్య చికిత్స కోసం ఆర్ధిక సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. స్పందించిన MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలను మంజూరు చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, BJJR నగర్ కు చెందిన శంకర్ తదితరులు ఉన్నారు.
