ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత పాలకమండలి పైనే ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ లోని గణేష్ టెంపుల్ ఆధ్వర్యంలో రూపొందించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి కి ఎంతో కృషి చేసిందని తెలిపారు. గణేష్ టెంపుల్ ను కూడా ఎంతో అభివృద్ధి చేసి భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పించిందని వివరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధి కి సమిష్టిగా కృషి చేయాలని కోరారు. తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఓదెల సత్యనారాయణ, సభ్యులు వజీర్ మోహన్, వినోద్, అశోక్, శ్రీశైలం తదితరులు ఉన్నారు

