మార్గశీర్ష మాసం పౌర్ణమితిధిని పురస్కరించుకొని మంగళవారం ఒంగోలు నగరంలో స్థానిక కోర్టు సెంటర్ వద్దగల శ్రీ బాపూజీ గోసంరక్షణ సంఘం నుండి వందలాది భక్తులు తరలిరాగా అందమైన తేరుపై ఇరుదేవేరులతో శ్రీవారిని అలంకరించి భక్తులు గోవింద నామ స్మరణ చేస్తూ శ్రీగిరి గిరి ప్రదక్షిణను కోర్టు సెంటర్, కేశవస్వామి పేట, శర్మా కాలేజ్ క్రికెట్ గ్రౌండ్, గద్దలగుంట, కొణిజేటి బస్టాండ్ మీదుగా శ్రీగిరి వెంకటేశ్వర స్వామి వారిని, స్కందగిరి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు.
కార్యక్రమానికి ముందుగా గో సంఘంలో గోపూజ నిర్వహించారు. అనంతరం గోమాత ముందునడువగా గరుడ, హనుమత్, శంఖ చక్ర నామాలు పట్టుకున్న భక్తులు, అఖండ దీపాన్ని తలపై పెట్టుకుని, గోవిందనామాలు పటిస్తుండగా వీరాంజనేయుని విగ్రహం ఒక రథముపై, వెనుక స్వామి వారు హారతులు అందుకుంటూ భక్తులను అనుగ్రహించారు.
కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళాభక్తులు, రాధా గోవింద భక్త బృందం పాల్గొన్నారు.



