పొగాకు సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి నాణ్యత వస్తుందని పొగాకు బోర్డు ఒంగోలు-2 వేలం నిర్వాహణాధికారి కోవి రామక్రిష్ణ తెలిపారు. ఎన్.జి. పాడు మండలం మాచవరం గ్రామంలో పొగాకు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులకు పురుగు మందు అవశేషాలు, అన్యపదార్థాలు వలన కలిగే ప్రతి కూల పరిస్థితులపై అవగాహన కల్పించారు. తలలు త్రుంచుట, పిలకల నివారించుట వలన కలిగే ఉపయోగాలను, నీటి తడుల యాజమాన్యపై పంట నియంత్రణపై పాటించాల్సిన పద్ధతులను వివరించారు. పేనుబంక, పచ్చపురుగు, రసం పీల్చే పురుగులకు ప్రొయిన్ 5 గ్రా. 10 లీటర్లలో కలిపి పిచికారి చేసి నివారించుకోవాలని సూచించారు. అంతర సేద్యం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోను విధానంపై, 0:0:50 మందును నీటిలో కలుపుకుని పిచికారి చేసుకున్నందున మంచి క్వాలిటీ వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఐటీసీ మెనేజర్ యశ్వంత్ కుమార్, ఎఫ్ ఏ రామాంజనేయులు, బోర్డు సిబ్బంది, రైతు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

