లక్ష్యా సాధనలో అలసత్వం పనికిరాదు. అప్పుడు విజయం మీ సొంతం.

  • కే. దిలీప్ కుమార్ రెడ్డి.
    బిఆర్ ఒలంపియాడ్ హై స్కూల్ లో నూతన సంవత్సర వేడుకలు.
  • ఆనందోత్సాహాలతో విద్యార్థులు.

నూతన సంవత్సరం ఆగమనంతో విద్యార్థులంతా తమ లక్ష్యాలను చేరుకునే విధంగా కృషి చేయాలని, లక్ష్య సాధనలో అలసత్వం పనికిరాదని, ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను అర్థం చేసుకొని రాబోయే పరీక్షలలో ఉన్నతంగా రాణించాలని, అంతేకాకుండా విద్య నేర్పిన గురువుల, పాఠశాల, జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆకాంక్షల కు అనుగుణంగా తమ జీవిత నడవడికను రుజుమార్గంలో ప్రయాణించే విధంగా రోజువారి అలవాట్లను సరిదిద్దుకోవాలని, మొబైల్ ఫోన్లతో ఆడుకోవడం కాకుండా క్రీడా ప్రాంగణంలో ఆటలు ఆడాలని అప్పుడే శారీరక పట్టుత్వము, చలాకీతనము, హుషారు పెంపొందుతాయని బిఆర్ ఒలంపియాడ్ హై స్కూల్ ప్రిన్సిపల్ కే. దిలీప్ కుమార్ రెడ్డి విద్యార్ధులకు మార్గనిర్ధేశ్యం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

స్థానిక రామనగర్ 8వ లైన్ లో గల బిఆర్ ఒలంపియాడ్ హై స్కూల్ విద్యార్థులు నూతన ఆంగ్ల సంవత్సరం ఆగమనంతో జనవరి ఒకటో తేదీని పండుగగా, ఉత్సాహంగా, వేడుక జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్కూల్ ప్రిన్సిపాల్ కే. దిలీప్ కుమార్ రెడ్డి విచ్చేశారు. సమయపాలన అంశంపై ప్రసంగించారు.

ఈ సందర్భంగా విద్యార్థినివిద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా గీతాలను ఆలపించారు. నృత్యాలు చేశారు. కార్యక్రమంలో నూతన సంవత్సర కేక్ ని కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్కూల్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది మరియు స్కూల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *