సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్ని కల్లో మళ్లీ సీఎం చేయడమే లక్ష్యంగా పని చేయాలని దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్ర సాదొడ్డి సూచించారు. దర్శి బూచేపల్లి నివాసంలో జేసీఎస్ కన్వీనర్లను డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయాల్లో పని తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. గ్రామాల్లో ప్రతి నాయకుడు కార్యకర్తలను కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నేడు జరిగే ఎన్నికల ప్రచారం ప్రారంభోత్సవానికి నిర్వహించే బైక్ ర్యాలీ లో ప్రతి నాయకుడు, కార్యకర్త పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. జేసీఎస్ మండల కన్వీనర్లు మేడికొండ జయంతి, యాడిక శ్రీనివాస రెడ్డి, బత్తినేని వెంకటేశ్వర్లు, ఎదురు కోటిరెడ్డిలు పాల్గొన్నారు.


