క్రీడలకు సీఎం జగన్ ప్రోత్సాహం -చరిత్రలో లేని విధంగా ఆడుదాం ఆంధ్రా!-జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టారని జెడ్సీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, నియోజకవర్గ ఇన్ చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాదిరెడ్డి పేర్కొన్నారు. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల్లో భాగంగా బుధవారం నియోజకవర్గస్థాయి క్రీడా పోటీలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు ప్రారంభించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డిలు క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహ పరిచారు. వారిని దుశ్శాలువాలు, పూల మాలలతో ఘనంగా సత్కరించారు. వెంకాయమ్మ. శివప్రసాద్ లు మాట్లాడుతూ ..సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. అందు నాడు-నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి, పేదల పిల్లా లకు ఇంగ్లిష్ మీడియం విద్య. అమ్మవడి, ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ వంటి పథ కాలు ప్రవేశ పెట్టి పేద విద్యార్థులకు అండగా నిలిచా రన్నారు. నగర పంచాయతీ కమిషనర్ మహేష్, ఎంపీడీవో హనుమంతరావు, ఎంపీపీ సుధా అచ్చయ్య, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, కౌన్సిలర్లు మేడం మోహన్ రెడ్డి.. జగన్నాథం మోహన్ బాబు, ఆవుల శివారెడ్డి, ఎంపీ టీసీ సంఘ జిల్లా అధ్యక్షుడు బండి గోపాల్ రెడ్డి సర్పంచ్ కేసరి రాంభూపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు చింతలపూడి శ్రీనివాసరెడ్డి, గోను వెంగళరెడ్డి, మాజీ ఎంపీటీసీ కరిపిరెడ్డి సుబ్బారెడ్డి, నాయకులు ముప్పూరి బ్రహ్మయ్య, వెన్న పూస బాపిరెడ్డి, పీడీలు అంజిరెడ్డి తదితరులు   పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *