లక్కవరం గ్రామంలో అనుమతి లేకుండా విక్రయించేందుకు నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను తాళ్లూరు ఎస్సై వైవీ రమణయ్య తమ సిబ్బందితో మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపు లోకి తీసుకున్నారు. లక్కవరం గ్రామానికి చెందిన కూకట్ల వెంక టేశ్వర్లు అక్రమంగా మద్యం విక్ర యిస్తున్నాడని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తాళ్లూరు ఎస్సై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో అక్రమంగా నిల్వ ఉంచిన గోలెన్ స్టెప్స్ 10 బాటి ళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని దర్శి కోర్టుకు హజరు పరుచనున్నట్లు ఎస్ఐ తెలిపారు. మద్యం విక్రయదారుడు వెంకటేశ్వర్లు వైసీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా సెక్రటరీ తండ్రి కావడంతో రాజకీయ ఆరోప ణలకు ప్రాధాన్యత ఏర్పడింది. వైసీపీ ట్రేడ్ యూనియన్ నేత, ఎమ్మెల్యే మద్దిశెట్టి వర్గీయుడిగా ఉండి బూచేపల్లికి దూరంగా ఉన్నందునే ఇలా కేసు నమోదు చేయిస్తున్నారని వైసీపీ ట్రేడ్ యూనియన్ సెక్రటరీ కూకట్ల బ్రహ్మం ఆరోపించారు. బూచే పల్లి వైసీపీ ఇన్చార్జిగా నియమి తులైన 20 రోజుల్లోనే గ్రామం లోని బూచేపల్లి వర్గీయులు రెం డు పర్యాయాలు తమ ఇంటిపైనే దాడులు చేయించి కేసులు న మోదు చేయించి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని తెలిపారు.
లక్కవరంలో మద్యంబాటిళ్ల పట్టివేత – రాజకీయ నేపథ్యంలోనే దాడి చేశారని ఆరోపణలు
25
Jan