దర్శి నియోజకవర్గం.. మా కుటుంబం – నా కుమారుడు శివప్రసాద్ రెడ్డి ని ఆశీర్వదించండి -ప్రజలకు జెడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ విజ్ఞప్తి- సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన-తల్లితో కలిసి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన దర్శి ఇన్చార్జి డాక్టర్ శివ ప్రసాద్ రెడ్డి -హామీలిచ్చి అమలు చేయకపోవడమే చంద్రబాబు నైజమని ధ్వజం

నా బిడ్డ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి నియోజకవర్గం నుంచి వైఎస్సార్ తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి నా బిడ్డను ఆశీర్వదించండి అని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఎన్నికల ప్రచారం ప్రారంబోత్సవం సందర్భంగా రాజంపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆమె తన కుమారుడితో కలిసి ర్యాలీగా దర్శికి చేరుకున్నారు. దర్శిలోని గడియారం స్తంభం సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. ఈ సందర్భంగా భారీగా హాజరైన పార్టీ శ్రేణులు, ప్రజలను ఉద్దే శించి వెంకాయమ్మ మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మన ఊరు-మన శివన్న కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు బూచేపల్లి శివప్రసా దొడ్డి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడమే బూచేపల్లి కుటుంబం ముఖ్య ఉద్దేశమ న్నారు. శివ ప్రసాద్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పాలనసాగిస్తున్న సీఎం వైఎస్ జగన్.. రానున్న ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
వైఎస్సార్ సీపీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ..తన తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, దివంగత సీఎం వైఎస్సార్ దైవ సమానులని పేర్కొన్నారు. తనకు కులాలు, మతాలు, వర్గాలు లేవని చెప్పారు. దర్శి నియోజకవర్గ ప్రజలంతా తమ కుటుంబమని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. పది మందికీ సాయం చేయడమే తన తండ్రి సుబ్బారెడ్డి నేర్పారని, అందుకే సీఎం జగనన్న వెంట నడుస్తున్నానన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజ లకు విజ్ఞప్తి చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మోసం చేయడమే బాబు నైజం
రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలు అం దించారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు హామీ లిచ్చి గాలికొదిలేయడం చంద్రబాబు నైజమని ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేసేందుకు కట్టగట్టుకుని వస్తున్న చంద్రబాబుకు సరైన బుద్ధి చెప్పి ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు.

దర్శిలో ఉప్పొంగిన అభిమానం – వైఎస్సార్ సీపీ ర్యాలీకి జననీరాజనం -బైక్ ల తో భారీ ర్యాలీ -అడుగడుగునా హారతులిచ్చి స్వాగతం పలికిన ప్రజలు -హాజరైన జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి

దర్శి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఎన్నికలప్రచారం గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఆయన సతీమణి బూచేపల్లి నందినిలు హాజరయ్యారు. రాజంపల్లి శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో అష్టోత్తర శతనామావలి, ఆకుపూజ, వేదమంత్రాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రాజంపల్లి, కొత్తరెడ్డిపాలెం, దర్శి గడియారం స్తంభం సెంటర్, వైఎస్సార్ సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
రాజంపల్లి నుంచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సుమారు 3వేలకుపైగా బైక్ లతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మోటారు సైకిళ్లకు వైఎస్సార్ సీపీ జెండాలు పెట్టుకుని బూచేపల్లి కుటుంబానికి ఘన స్వాగతం పలికారు. గుమ్మడి కాయలతో దిష్టి తీసి గజమాలలతో ఘనంగా సత్కరించారు. దర్శి పట్టణం లోని దద్దాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలుచేశారు. గడియారం స్తంభం సెంటర్ కు చేరుకునే సరికి దర్శి పట్టణం కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా జన సందోహమే కనిపిస్తూ జై జగన్.., జై బూచేపల్లి అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. అడుగడుగునా హారతులిచ్చి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. శివప్రసాద్ రెడ్డి కుమారుడు విద్యాధర రెడ్డి ని బుల్లెట్
పై ఎక్కించుకుని ర్యాలీలో బైక్ నడిపి కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. శివప్రసాద్ రెడ్డి సతీమణి బూచేపల్లి నందినీ తన భర్త శివ ప్రసాద్ రెడ్డి కి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జై.. జగన్, జై.. శివన్న అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.

ఆయా కార్యక్రమాలలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు వెన్న పూస వెంకటరెడ్డి, తూము వెంకటసుబ్బారెడ్డి, సుబ్బయ్య, ఎంపీపీలు సుధాఅచ్చయ్య, బొరిగొర్ల ఉషామురళి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం బాషా, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి,ఏఎంసీ మాజీ చైర్మన్ కేవీ రెడ్డి, సాగర్ ప్రాజెక్ట్ మాజీ వైస్ చైర్మన్ సద్ది పుల్లారెడ్డి, మాజీ ఎంపీపీలు ఇత్తడి దేవదానం, గోళ్లపాటి మోషె, కోట రామిరెడ్డి, పోశం మధుసూధన్ రెడ్డి , జే సి ఎస్ కన్వీనర్లు వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, జయంతి , ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్, యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శి ఇరుగుల శ్రీనివాసరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు మేకల కృష్ణారెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి వెర్రి ఆంజనేయరెడ్డి, జెడ్పీటీసీలు నుసుం నాగిరెడ్డి, తాతపూడి రత్నరాజు, వైస్ ఎంపీపీలు సోము దుర్గారెడ్డి, కొరివి ముసలయ్య, ఇడమకంటి వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ లు కేసరి రాంభూపాల్ రెడ్డి, కౌన్సిలర్ లు ఆవుల జ్యోతి శివారెడ్డి, మేడం మోహన్ రెడ్డి, జగన్నాథం మోహన్ బాబు, నాయకులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *