75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పామూరు మండలం కంబాలదిన్నె జడ్.పి.హెచ్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు పి మహబూబ్ ఖాన్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగినాయి. ముందుగా ప్రధానోపాధ్యాయులు మహబూబ్ ఖాన్ జాతీయ జెండాను ఎగరవేసి ప్రసంగించారు. గణతంత్ర ప్రాధాన్యత పై విద్యార్థులకు సవివరంగా వివరించారు. అనంతరం ఆటపాటలతో గెలుపొందిన విద్యార్ధులను అభినందించి బహుమతి ప్రదానం చేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీటిసి నీలం వెంకట రమణయ్య, గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీరాములు, గొల్ల మాల్యాద్రి నాయుడు, పిచ్చల తిరుపతి రెడ్డి, మనం రమణయ్య, వీరబాబు, సుబ్బారావు, వెంకటరెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు ఎస్ లక్ష్మీ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
