జగన్ మళ్లీ సీఎం అయితేనే సంక్షేమ పథకాలు – సీఎం చేతుల మీదుగా త్వరలో ఒంగోలులో ఇంటి పట్టాలు – నావల్ల మేలు జరిగితేనే ఓటేయండి అని చెప్పే దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ – రూ.3 కోట్లతో నిర్మించిన మున్సిపల్ కార్యాలయం నూతన భవనాన్ని ప్రారంభించిన బాలినేని, మంత్రి మేరుగు, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి

సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

న్నరేళ్లుగా నిరంతరం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా ఆయన్నుమళ్లీ గెలిపించుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.శనివారం చీమకుర్తి మున్సిపల్ కార్యాలయంనూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికిబాలినేనితో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి, సంతనూతలపాడు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త
మేరుగు నాగార్జున, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలినేనిమాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు చంద్రబాబు డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తాననిచేయలేదని.. పసుపు కుంకుమ పేరుతో చేతులుదులుపుకున్నాడన్నారు. కానీ ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు డ్వాక్రామహిళల రుణాలను నాలుగు విడతలుగా చెల్లిస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని చెప్పారు.ఒంగోలులో పేదల ఇళ్ల స్థలాలకు డబ్బులిస్తేనే పోటీచేస్తానని చెప్పానని, చెప్పిన ప్రకారమే సీఎం పేదల ఇళ్ల స్థలాల కోసంరూ.210 కోట్లు మంజూరు చేశాడని గుర్తు చేశాడు.త్వరలో సీఎం చేతుల మీదుగా ఒంగోలులోని 25వేల మంది పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి మేరుగు నాగార్జునను అత్యధిక మెజా రిటీతో సంతనూతలపాడు ఎమ్మెల్యేగా గెలిపిం చాలని స్థానిక ప్రజలకు బాలినేని విజ్ఞప్తి చేశారు.

మేలు జరిగితేనే ఓటేయండని చెప్పే దమ్మున్న నాయకుడు జగన్:

మీకు మేలు జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పే దమ్మున్న నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని జిల్లా ఇన్చార్జి మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. సంక్షేమ పథకాల వలన లబ్ధిపొందని కుటుంబం లేదని అన్నారు. జగన్ అవసరం ప్రజలకు ఎంతో ఉందని.. ఆయ నను మళ్లీ సీఎంగా గెలిపించుకుంటేనే ఇప్పుడొస్తున్న సంక్షేమ పథకాలు మళ్లీ అందుతాయని తెలిపారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ సంతనూతలపాడు నియోజకవర్గంలో మళ్లీ వైఎస్సార్ సీపీ జెండాను ఎగురవేయాలని, మేరుగు నాగార్జునను గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్ సీపీ గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే, దర్శి వైఎస్సార్ సీపీ ఇన్చార్జి బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ నూటికి నూరు శాతం హామీలు నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. జిల్లాలో మళ్లీ వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడాలని, వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకునే వరకుపార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు.తొలుత రూ.3 కోట్లతో నిర్మించిన మున్సిపల్కార్యాలయం నూతన భవనాన్ని బాలినేని, మేరుగునాగార్జున, బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాదరెడ్డిచేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరండ్వాక్రా మహిళలకు రూ.14.57 కోట్ల విలువ చేసేవైఎస్సార్ ఆసరా నాలుగో విడత చెక్కును అందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తొలుత డ్వాక్రా మహిళలతో కలిసి జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ కోలాటం ఆడటం ఆకట్టుకుంది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గోపురపు రాజ్యలక్ష్మిపూర్ణచంద్ర, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, ఎంపీపీ
యద్దనపూడి శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ మారెళ్లబంగారుబాబు, చీమకుర్తి పట్టణ వైఎస్సార్సీపీ కన్వీనర్ క్రిష్టిపాటి శేఖరరెడ్డి, రూరల్ కన్వీనర్ పమిడి వెంకటేశ్వర్లు, సంతనూతలపాడు, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల కన్వీనర్లు దుంపా చెంచిరెడ్డి, మండవ అప్పారావు, పోలవరపు శ్రీమన్నారాయణ, సంతనూతలపాడు జెడ్పీటీసీ దుంపా రమణమ్మ, నలమలపు కృష్ణారెడ్డి, చీమకుర్తి మున్సిపల్వైస్ చైర్మన్లు బాపతు వెంకటరెడ్డి, ఎన్.మాణిక్యం,డాక్టర్ బీ.జవహర్, చలువాది బదరీనారాయణ,గోగినేని వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, పలు విభాగాలకు చెందిన పార్టీనాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *