తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం పంచాయితీ పరిధిలోని సోమవరప్పాడు లో ఆదివారం వేకువజామున పోలీసులు తనిఖీలు చేపట్టారు. కార్డన్ సెర్చ్ లో భాగంగా ఎఎస్పీ శ్రీధర్, డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఐ రామకోటయ్య, ఎస్సై వై.వి.రమణయ్య, అధిక సంఖ్యలో సిబ్బంది ముమ్మ రంగా తనిఖీలు చేశారు. 200 గృహాల్లో క్షుణ్ణంగా పరిశీలించారు. పదిహేను ద్విచక్ర వాహనాలకు సంబంధించి సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో తాళ్లూరు పోలీసు స్టేషన్ కు తరలించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిం చాలని ప్రయత్నిస్తే చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. మద్యం, మత్తు పదార్థాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు



