సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతిగా సంక్షేమపథకాలుఅమలు చేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్పర్సన్
బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి, డాక్టర్
బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. తాళ్లూరు వి.కె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం మహిళలకువైఎస్సార్ ఆసరా సంబరాల్లో భాగంగా నాలుగోవిడత రుణమాఫీ రూ.6.06 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. తాళ్లూరు మండలం అంటేనే జగనన్నఅడ్డా అని, జగనన్న అడ్డ అంటే శివన్న అడ్డ అనితెలిపారు. పాదయాత్రలో మహిళల కష్టాలు
నేరుగా తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మహిళల సంక్షేమం కోసంఎన్నో పథకాలు ప్రవేశపెట్టి నేరుగా వారి ఖాతాకే
నగదు జమ చేస్తున్నారన్నారు. విద్యా, వైద్యంకోసం అధిక ప్రాధాన్యమిచ్చి పేదల అభ్యున్నతికి జగనన్న పాటుపడుతున్నారని తెలిపారు. మహిళలకు అన్ని రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లుఅమలు చేస్తున్న జగనన్నకు మనం రుణపడి ఉండాలన్నారు. ఇంటి స్థలం మంజూరుతో పాటు
నిర్మాణం పూర్తయ్యే వరకు బాధ్యత తీసుకున్న ఏకైకసీఎం జగనన్న అని తెలిపారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎంగా చేసుకోవాల్సిన అవసరంఉందన్నారు. 20 ఏళ్లుగా దర్శి నియోజకవర్గాన్ని
అంటిపెట్టుకొని ప్రజా సేవ చేస్తున్న బూచేపల్లిజిల్లా పరిషత్ నిధుల నుంచి రూ.50 లక్షలు మహిళా భవన నిర్మాణానికి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
*చంద్రబాబు జీవితం మొత్తం అవినీతిమయమే..*
చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం అవినీతిమ యమని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి జగనన్న ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు. పేదల కోసం సీఎం అమలు చేస్తున్న సం క్షేమ, అభివృద్ధి పథకాలను తప్పుబడుతున్న చంద్ర బాబు, పవన్కళ్యాణ్కు వాటిని తొలగిస్తామని చెప్పే దమ్ము, ధైర్యం లేదన్నారు. బంగారుగొలుసులు, బిస్కెట్లు, ఉచిత సిలిండర్ల పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు వస్తున్న మాయగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.
గత పాలనలో జన్మభూమి కమిటీలు నీరు – చెట్టుపథకం పేరుతో ప్రజాధనాన్ని నిలువునా దోచేశారన్నారు. ముందుగా వైఎస్సార్, బూచేపల్లిసుబ్బారెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళలకు రూ.6.06కోట్ల చెక్కులు అందజేశారు. అనంతరం సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో శివప్రసాదరెడ్డి సతీమణి నందిని, కాపా రమణారెడ్డి,
వైస్ ఎంపీపీలు యిడమకంటి వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ చార్లెస్ సర్జన్, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు తూము వెంకటసుబ్బారెడ్డి,
వైఎస్సార్ సీపీరాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బారెడ్డి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి,మండల జేసీఎస్ కన్వీనర్ యాడిక శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ 2 యామర్తిప్రభుదాసు, బ్రహ్మారెడ్డి, ఓబులరెడ్డి, ఎన్ . బి. పాలెం సర్పంచ్ చిమటా సుబ్బారావు, సొసైటీ అధ్యక్షులుకుమ్మిత జయరామిరెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు పులి ప్రసాదరెడ్డి,ఎంపీడీఓ యుగకీర్తి,ఎంఈఓ సుబ్బయ్య, కె.వి పాలెం జెసిఎస్ కన్వీనర్ కొర్రపాటి విష్ణు, బోగ్గులు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి జక్కుల రామకృష్ణ ,పలు గ్రామాలు సర్పంచులు, ఇతర నేతలుపాల్గొన్నారు.






