ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హేట్రిక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా దర్శి నియోజక వర్గంలో బిజేపి శ్రేణులు సంబరాలు నిర్వహించారు. దర్శి పట్టణంలో బాణ సంచా పేల్చి, మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా దర్శి నియోజక వర్గ బిజేపి ఇన్చార్జి మాడపాకుల శ్రీనివాసులు మాట్లాడుతూ మన భారత ప్రధాన మంత్రి వికసిత్ భారత్ ధ్యేయంగా ముందుకు సాగాలని, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి బాటలో ముందుకు సాగాలని ఆకాక్షించారు. జిల్లా ఉపాధ్యక్షుడు ,నియోజక వర్గ కో కన్వినర్ తిండి నారాయణ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అచ్యుత గురువార్జన్, బచ్చు నరసింహారావు, బచ్చు అనిల్, ఎవీ నారాయణ రెడ్డి, అచ్యుత శరత్, యువ నాయకుడు రామాంజి, రామారావు, జనసేన నాయకుడు పాపారావు, మధు, బిజేపి కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజంపల్లి గ్రామంలో …
రాజంపల్లి గ్రామంలో బాణ సంచా పేల్చి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు తిండి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో భారత దేశాన్ని మూడవ ఆర్ధిక వ్యవస్థగా మార్చటమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ పాలన సాగాలని ఆక్షాంక్షించారు. ప్రజల ఆక్షాంక్షలకు అనుగుణంగా మోదీ పాలన ఉంటుందని చెప్పారు. రూరల్ మండల అధ్యక్షుడు కాకర్ల సాయి, కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం శ్రీనివాసులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాళ్లూరు మండలంలో… మారం గోవింద రెడ్డి ఆధ్వర్యంలో మిఠాయిలు పంచి పెట్టారు. టిటిపి యువనాయకుడు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు.
కురిచేడు మండలంలో ….. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి పెట్టుకున్నారు. కురిచేడు మండల అధ్యక్షుడు కురంగి నాగేశ్వరరావు, టిడిపి కాట్రాజు నాగరాజు, రావురి క్రిష్ణా రావు, సుబ్రమణ్యం, డి వెంకట రెడ్డి, పిచ్చయ్య, కూటమి సభ్యులు పాల్గొన్నారు.
దొనకొండ మండలంలో బిజేపి పార్టీ అధ్యక్షుడు వెంకట్రామయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టారు. టిడిపి అధ్యక్షుడు ఎన్ శివ కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.




