మాతాజీ నగర్ కు అనుకుని వున్న ఎఫ్ టి ఎల్ స్థలం లో ఇంటి నంబర్ల ,విద్యుత్ మీటర్లు ఎలా ఇచ్చారు…….బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలి……బాధితులకు సదరు కంపనీ న్యాయం చేయాలి…..బీ జె పీ సీనియర్ నాయకులు నెమలి ఆనంద్…………………………

.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

బేగంపేట మాతాజీ నగర్ బస్తీ కి అనుకుని వున్న సర్వే నెంబర్ 194/8/1లో వున్న 10ఎకరాల 20 గుంటల హుస్సేన్ సాగర్ ఎఫ్ టి ఎల్ స్థలం లో నిర్మించిన అక్రమ నిర్మాణాలకు జీ హెచ్ ఏం సీ అధికారులు ఇంటి నంబర్ల ఎలా ఇచ్చారని బీ జె పీ సీనియర్ నాయకులు నెమలి ఆనంద్ ప్రశ్నించారు.బేగంపేట శ్యామ్ లాల్ బిల్డింగ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు విద్యుత్ మీటర్లు కూడా ఇవ్వడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివరాలు కావాలంటూ ఆర్ టి ఎ ద్వారా సమాచారం కోరానన్నారు.అయితే అధికారులు తాను అడిగిన వివరాలు ఇవ్వకుండా కాలక్షేపం చేశారని అన్నారు. ఓ రియల్ ఎస్టేట్ చేసిన మోసానికి అమాయకులు నష్టపోయారని,సదరు కంపెనీ బాధితులకు న్యాయం చేయాలని ఆనంద్ డిమాండ్ చేశారు .అక్రమంగా నిర్మించిన ఇళ్లకు అధికారులు ఇంటి నంబర్ల ఎలా ఇస్తారని ఈ విషయాన్ని మరోసారి తాను మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రూ,డిప్యూటి కలెక్టర్ చంద్రావతి ల దృష్టికి తీసుకెళతానని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారిని కోరనున్నట్లు ఆనంద్ తెలియ జేశారు .విద్యుత్ మీటర్లు ఎలా ఇచ్చారని అధికారులను ప్రశ్నిస్తే వారి నుంచి దాట వేత సమాధానం మాత్రమే వస్తుందన్నారు. ఈ విలేఖరుల సమావేశం లో నెమలి ఆనంద్ (నందు)తో పాటు మైసూర్ మదు,తారకం పేట శ్రావణ్ లు వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *