ఒంగోలు ఎంపీగా గెలిచిన తర్వాత మొదటి సారిగా మార్కాపురం పట్టణానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ప్రకారం మార్కాపురం ప్రత్యేక జిల్లా తధ్యమని అన్నారు.వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ ప్రాంతాన్ని మార్కాపురం జిల్లాలో కలిసేలా ప్రయత్నిస్తామన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా కూటమి శ్రేణులు విజయం చారిత్రాత్మకం అని ఒంగోలు ఎంపీ మాగుంట అన్నారు.తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడానికి ప్రజలు తహతహ లాడారని అభిప్రాయం వ్యక్తం చేశారు.దృఢమైన దీక్షతో అన్ని వర్గాల ప్రజలు కసితో ఓటు వేశారు అని అన్నారు.ఇదే ఒరవడి 2029 ఎన్నికల్లోనూ జరుగుతుంది ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశం లో టీడీపీ నాయకులు కందుల రామిరెడ్డి, తాళ్ళపల్లి సత్యనారాయణ, డాక్టర్ మౌలాలి తదితరులు పాల్గొన్నారు.
