తెలంగాణలో 28 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ

తెలంగాణలో 28 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల ఎస్పీగా అశోక్‌కుమార్‌, సూర్యాపేట ఎస్పీగా సన్‌ప్రీత్‌ సింగ్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా రాహుల్‌ హెగ్డే బదిలీ అయ్యారు. జోగులాంబ గద్వాల ఎస్పీగా టీ శ్రీనివాస్‌రావు, అవినీతి నిరోధకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌గా రుతురాజ్‌ను నియమించింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు, బాలానగర్‌ డీసీపీగా కే సురేశ్‌కుమార్‌, మహబూబ్‌నగర్‌ ఎస్పీగా ధరావత్‌ జానకి, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్ధన్‌, సీఐడీ ఎస్పీగా విశ్వజిత్‌ కంపాటి, శంషాబాద్‌ డీసీపీగా బీ రాజేశ్‌, మేడ్చల్‌ జోన్‌ డీసీపీగా ఎన్‌ కోటిరెడ్డిని నియమించింది. వికారాబాద్‌ ఎస్పీగా కే నారాయణరెడ్డి, నల్గొండ ఎస్పీగా శరద్‌ చంద్రపవార్‌, రైల్వేస్‌ ఎస్పీగా చందనాదీప్తి, వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా షేక్‌ సలీమాను నియమించింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *