ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో విద్యాశాఖాధికారులు తనిఖీ – యూ డైస్, గతంలో, ప్రస్తుత ఉన్న విద్యార్థుల వివరాలు సేకరణ – ప్రభుత్వ గుర్తింపు పత్రాలు, అదనపు తరగతుల అనుమతులు పరిశీలన

తాళ్లూరు మండలంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలను విద్యాశాఖాధికారులు బృందం మంగళవారం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మండల విద్యాశాఖాధికారి ఎంఈఓ – 1 జి సుబ్బయ్య ఆయన బృందం అరుణకుమారి, అంజలిలు తూర్పుగంగవరంలోని జాహ్నవి, గీతాంజలి, గంగా, ప్రగతి, శారద, బొద్దికూరపాడులోని అమెరికల్ పబ్లిక్ స్కూల్, తాళ్లూరులో మండల విద్యాశాఖాధికారి-2 సుధాకర్ రావు, ఆయన బృందం శేషగిరి, వెంకటరావు తదితరులు ఎబీసీ హైస్కూల్, శ్రీ సరస్వతి హైస్కూల్లలో పరిశీలించారు. ఆయా పాఠశాలలలో ప్రభుత్వ గుర్తింపు పత్రాలు, అదనపు సెక్షన్ల అనుమతి వివరాలు, యూ డైస్లో ఉన్న విద్యార్థుల సంఖ్యో, గతంలో రిజిస్టర్లలో ఉన్న విద్యార్థుల సంఖ్య, ప్రస్తుతం రిజిస్టర్లలో ఉన్న విద్యార్థుల సంఖ్యను క్షున్నంగా పరిశీలించారు. అదనంగా ఉన్న విద్యార్థులకు అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితులను వివరించారు. ఆయా కార్యక్రమాలలో ఆయా పాఠశాలల కరస్పాండెంట్స్, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *