ఐజేయు జాతీయ అధ్యక్షులు
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాసరెడ్డిని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ లు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఖమ్మంలో జరుగుతున్న టి యు డబ్ల్యు జే రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా వారు శ్రీనివాస్ రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై
వారు చర్చించారు త్వరలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులని కలసి జర్నలిస్టులు సమస్యలు పరిష్కారానికి కృషి చేయనున్నట్లు వారు తెలిపారు.
