తాళ్లూరు మండలం లోని బొద్దికూరపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల వరండా స్లాబ్ ఇటీ వల కూలింది. దీంతో బుధవారం ఏపీఈడబ్ల్యూడీసీ డీఈ రమణయ్య పాఠశాలను సందర్శించారు. వరండాపై భాగాన వర్షపు నీరు ఎక్కువగా నిల్వ ఉండటంతో వరండా స్లాబ్ కూలినట్లు నిర్ధారించారు. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్, హెచ్ఎంకు తెలిపారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
