ప్రజావాణి కి క్యూ కట్టిన ప్రజలు……….శుక్రవారం ప్రజావాణిలో 575దరఖాస్తులు…….

మహాత్మ జ్యోతిబాపూలే
ప్రజా భవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల క్యూ కట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు .వివిధ శాఖలకు చెందిన సమస్యలతో వచ్చిన ప్రజలు చిన్నారెడ్డిని, ప్రజాభవన్ అధికారులను ,కలిసి వినతి పత్రాలు అందజేశారు శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 575 దరఖాస్తులు అందాయి .వీటిలో రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 185 ,హౌసింగ్ కు సంబంధించి 64 ,దరఖాస్తులు వినియోగదారుల వ్యవహారాలు ఆహారం పౌరసరఫరాల శాఖలకు సంబంధించి 50 దరఖాస్తులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 43, హోంశాఖకు సంబంధించి 42 దరఖాస్తులు ఇతర శాఖలకు సంబంధించి 191 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణి ప్రత్యేక అధికారి మున్సిపల్ శాఖ సంచాలకులు దివ్య దేవరాజన్ ఇతర అధికారులు ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు స్వీకరించడంతోపాటు
వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి……

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను అందరిని రెగ్యులర్ చేయాలని కోరుతూ శుక్రవారం ప్రజాభవన్ లో
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్య దేవరాజన్ లను కలిసి రెగ్యులరైజేషన్ కు సంబంధించి వినతిపత్రం అందించారు.
ఈ విషయంపై చిన్నారెడ్డి దేవరాజన్ లు మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి రెగ్యులరేషన్ కు సంబంధించి సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే దీనిపై మిగతా అధికారులతో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకొని న్యాయం చేస్తామని చెప్పారు. రెగ్యులరేషన్ ప్రక్రియ జరిగే లోపు బేసిక్ డిఏ, హెచ్ఆర్ఏ, తో కూడిన స్కేలును తక్షణమే అమలు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్టు ఉద్యోగులు వినతిపత్రం ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కాంట్రాక్ట్ అధ్యాపకులు డాక్టర్ వేల్పుల కుమార్ ,డాక్టర్ పల్లటి నరేష్ ,డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు ,డాక్టర్ చిరంజీవి, డాక్టర్ సత్యం ,డాక్టర్ సమర్థతో పాటు అన్ని యూనివర్సిటీ లోకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు.

మాతాజీ నగర్ ప్రైడ్ ఇండియాలో ప్లాట్లు కొనుగోలుదారులకు న్యాయం చేయాలి………..

బేగంపేట్ మాతాజీ నగర్ సమీపంలోని ప్రైడ్ ఇండియా వెంచర్లో బాలాజీ నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరు సంవత్సరాల క్రితం ప్లాట్లు కొనుగోలు చేశామని కొందరు నిర్మాణాలు కూడా చేసుకున్నామని ,ఇటీవల జిహెచ్ఎంసి అధికారులు ఇది హుస్సేన్ సాగర్ ఎఫ్.టి.ఎల్ స్థలం అని పేర్కొంటూ తమ ఇండ్లను కూల్చివేశారని, నర్సరీ ఏర్పాటు చేశారని వారిపై తగిన చర్యలు తీసుకొని తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ ప్రజావాణిలో బాలాజీ నగర్ ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు స్వామి, బేగ్ ,సలీం ,మహేందర్, మునీర్ ఖాన్, జయరాం తదితరులు అధికారులను కోరారు. తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని ప్రతినెల 5వ తేదీలోపు జీతాలు ఇవ్వాలని పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని శుక్రవారం ప్రజావాణిలో అధికారులకు వారి వినతి పత్రం అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *