యోగా చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ టిసిఈఐ అధ్యక్షుడు ఆళ్ల బలరాం బాబు తెలిపారు .అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టి సీ ఈ ఐ )తెలంగాణ ఈవెంట్ ఫెసిలిటేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యో!గ్లామర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాను సికింద్రాబాద్లోని క్లాసిక్ గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత ఒత్తిడితో కూడిన ఉద్యోగాల్లో పరిశ్రమ ఉద్యోగాలు రెండో స్థానంలో ఉన్నాయన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా ఈవెంట్లు చేయడం ఒత్తిడిని సృష్టిస్తున్నాయి అన్నారు. ఒత్తిడి నీ తగ్గించుకునేందుకు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 2018 నుంచి యోగ డే నిర్వహిస్తున్నామన్నారు
గత ఏడాది ఈ కార్యక్రమాన్ని బన్సిలాల్ పేట వద్ద నిర్వహించమన్నారు. తమ సభ్యులలో కొంతమంది జీవితకాల యోగ అభ్యాసకులుగా మార్చడానికి ఇది వీలు కల్పిస్తుంది అన్నారు. అంతకుముందు జ్యోతి సుకుమార మార్గ నిర్దేశంలో జుంబా సెషన్ నిర్వహించారు.యోగ టీచర్ సోనాలి మోర్జ్ యోగ చేయించారు.యోగ ప్రాముఖ్యతను వివరించారు యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలిపారు. ఈవెంట్ కు 125 మందికి పైగా సభ్యులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో టి ఈ ఎఫ్ ఏ టి సి ఐ అధ్యక్షుడు మనోజ్ ఇనాని టి సి ఐ జనరల్ సెక్రటరీ రవి బుర టిసి ఏఐ సెక్రెటరీ ప్రవీణ్ అగర్వాల్ కోశాధికారి పవన్ కుమార్ అగర్వాల్ యోగా కన్వీనర్ జిగ్నా మహిత తదితరులు పాల్గొన్నారు.







