రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం వద్ద శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… దర్శి మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన ముత్తుకూరి బ్రహ్మయ్య (40) కొరిశపాడు మండలం మేదరమెట్లలో బేల్దారి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. శుక్రవారం ఉదయం స్వగ్రామంలో ఉన్న తల్లిదండ్రులను చూసేందుకు ద్విచక్ర వాహనంపై చెరువుకొమ్ముపాలెం వెళ్లాడు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి మేదరమెట్ల వెళ్తూ మార్గం మధ్యలో తూర్పుగంగవరం మలుపు వద్ద ఎదురుగా వచ్చిన లారీని మధ్య భాగంలో ఢీకొ ట్టాడు. దీంతో బ్రహ్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కి సమా చారం ఇచ్చి ఒంగోలు రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బ్రహ్మయ్య మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ మోహనరావు సం ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలడిగి తెలుసుకున్నారు. మృ తుడికి భార్య సామ్రాజ్యం, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య సామ్రాజ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ మోహనరావు తెలిపారు.
