కంటోన్మెంట్ నియోజకవర్గంలో వార్డు 2 లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ శనివారం పర్యటించారు .ఈ సందర్భంగా ఆయన నేరుగా ప్రజలనుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు .బోయిన్పల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి గోపాల్ రెండవ వార్డులో అసంపూర్తిగా నిలిచిపోయిన కమ్యూనిటీ హాలు నిర్మాణాన్ని పూర్తి చేయాలని, ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి తీసుకువచ్చారు .అలాగే డ్రైనేజీలు పొంగి రోడ్డుపై పారకుండా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు .డబుల్ బెడ్ రూమ్ ఇల్లు చత్తూ కూలిపోతుందని, విద్యుత్ సిబ్బంది అకారణంగా విద్యుత్ కట్ చేస్తున్నారని, తగిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేని కోరారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ వార్డు 2 లో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులు పూర్తయ్యలా చూస్తానన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా అన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చిన తనను సంప్రదించాలని ఆయన సూచించారు .రానున్న రోజుల్లో కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని వార్డులో పర్యటించి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గణేష్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి గోపాల్ ,బాలరాజ్, ఆంజనేయులు ,జిలాని, రవి, శ్రీనివాస్ ,తదితరులు పాల్గొన్నారు.


