డాక్టర్ శ్యామ్ ముఖర్జీ వర్ధంతి నిర్వహణ -ఆయన ఆశయ సాధనకు కృషి -భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శివా రెడ్డి

భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శివా రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శివా రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మణ కుటుంబంలో 1901లో జులై 1న బెంగాళీలో పుట్టిన డాక్టర్ శ్యామ్ ముఖర్జీ జాతీయ వాది నేతలలో ప్రముఖడు అని 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడిగా ఉన్న ముఖర్జీ హిందూ జాతీయ వాదాన్ని ప్రగాఢంగా నమ్మి దేశంలో అనేక హిందూ మహాసభలు నిర్వహించి తొలి హిందూ వాద రాజకీయ పార్టీని స్థాపించిన నేతగా స్థానం సంపాదించారని, దేశ సమగ్రత కోసం ప్రాణ త్యాగం చేసిన మహానీయుడు అని కొనియాడారు. ఆయన కన్న కళలను నేడు బిజేపి ఆధ్వర్యంలో పీఎం నరేంద్ర మోదీ సాకారం చేస్తుందని అన్నారు. కాశ్మీరుకు 1953 జూన్ 23న ప్రత్యేక ప్రతిపత్తిని వ్యతిరేకిస్తూ అనుమతి లేకుండా కాశ్మీర్లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా అరెస్ట్ చేసారని, నిర్బంధంలో ఉన్న సమయంలో అనుమానాస్పద స్థితిలో తన ప్రాణాలను త్యాగం చేసిన మహానీయుడు అని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. పార్టీ సీనియర్ నాయకులు, మహిళ మోర్చ, అధికార ప్రతినిథి,ఇతర

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *