విద్యార్థుల భవిష్యత్తుకు, మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమన్నారు ప్రకాశం జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ చైర్మన్, శ్రీ హర్షిణి కళాశాల అధినేత గోరంట్ల రవికుమార్. ఒలంపిక్ డే సందర్భంగా ఒంగోలులో జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ సారథ్యంలో ప్రకాశం భవన్ నుండి మినీ స్టేడియం వరకు 5కే రన్ ను నిర్వహించగా ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ గోరంట్ల రవికుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం ఒలంపిక్ రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఒలంపిక్ డే సందర్భంగా ఒలంపిక్ రన్ ను నిర్వహించడం జరుగుతుందన్నారు. వేగంగా దృఢంగా బలిష్టంగా ఉండటమే క్రీడల ప్రధాన ఉద్దేశమని, విద్యార్థుల చదువుకు మానసిక ఉల్లాసానికి దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమన్నారు. అన్ని రంగాలతో పాటు క్రీడారంగంలో విద్యార్థులు ఎక్కువగా పాల్గొనాలని, క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. 40కు పైగా వివిధ రకాల క్రీడా అసోసియేషన్ లు ఒలంపిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తాయని, ప్రకాశం జిల్లాలో ఒలంపిక్ డే రన్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఒంగోలు జరిగిన ఒలంపిక్ రన్ లో ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా క్రీడ సాధికార సంస్థ, కరాటే అసోసియేషన్, స్కూల్ గేమ్స్ అసోసియేషన్, కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు తోపాటు జిల్లాలోని వివిధ కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొని ఒలంపిక్ డే ను ఘనంగా నిర్వహించారు.
