క్రీడాకారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తుందని కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ జంపన ప్రతాప్ అన్నారు. ఒలింపిక్ డే సందర్భంగా ఆదివారం సికింద్రాబాద్ జింఖానా మైదానం నుంచి ఎల్బీ స్టేడియం వరకు లిమిటెడ్ రన్ ను నిర్వహించారు. ఈ ఒలింపిక్ డే రన్ లో జంపన ప్రతాప్, హైదరాబాద్ జిల్లా యువజన క్రీడా విభాగం అభివృద్ధి అధికారి సుధాకర్, వెటరన్ అట్లేట్ మర్రి లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంపర్ ప్రతాప్ మాట్లాడుతూ ప్రతి ఏడాది క్రీడాకారులతో కలిసి ఒలంపిక్ అసోసియేషన్ నిర్వహించే ఒలింపిక్ దే రన్ లో పాల్గొంటున్నమన్న్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల విద్యార్థులు, కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభు కుమార్ గౌడ్ మునిరాజ్ ,జయరాజ్ ,జగదీష్, జంపన్న రవి, సాయిబాబా యాదవ్, వివిధ శిక్షకులు క్రీడాకారులు పాల్గొన్నారు.
