ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఈ నెల 26 వ తేదీన జరిగే సమావేశానికి హాజరు కావాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను దేవాదాయ శాఖ అధికారులు ఆహ్వానించారు. సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయ ఈ ఓ గుత్తా మనోహర్ రెడ్డి సోమవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి ఈ మేరకు ఆహ్వానాన్ని అందజేశారు. ఈ నెల 26 వ తేదీన ఉదయం 10.00 గంటలకు మహంకాళి అమ్మవారి ఆలయ ఆవరణలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమావేశం ఏర్పాటు చేసినట్లు ఈ ఓ వివరించారు. ముందుగా ఆలయ పండితులు ఎమ్మెల్యే కు ప్రసాదాలు అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, బీ ఆర్ ఎస్ పార్టీ రాంగోపాల్ పేట డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.


