బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తమయ్యారు .పలానా విమానాశ్రయం అంటూ ఆగంతకులు పంపిన మెయిల్లో పేర్కొనకపోవడంతో దేశవ్యాప్తంగా పోలీసు బలగాల అప్రమత్తమయి అన్ని విమానాశ్రయాల్లో తనిఖీలు నిర్వహించారు .అందులో భాగంగా బేగంపేట విమానాశ్రయంలో సైతం రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలు రంగంలోకి అనువణువునా తనిఖీలు నిర్వహించాయి. బేగంపేట ఏసిపి గోపాలకృష్ణమూర్తి ఇన్స్పెక్టర్ రామయ్య తో పాటు ఎస్ఐలు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ,ఐబి, డీజెసిఏ, క్లూస్ టీం తదితర విభాగాలు విమానాశ్రయంలో ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. దేశంలోని గుల్బర్గా ,అహ్మదాబాద్, నాగపూర్ ,కలకత్తా ,మదురై, సప్తర్ జంగ్,చెన్నై, కోయంబత్తూర్ ,అమృత్ సర్, త్రివేండ్రం ,విజయవాడ ,షిమ్లా, హుబ్లీ విమానాశ్రయాలలో బాత్రూం పైపు లలో బాంబ్ ఏర్పాటు చేసినట్లు ఒక మతపరమైన సంస్థ విమానాశ్రయాలకు మెయిల్స్ ద్వారా సందేశం పంపారు. సోమవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం డైరెక్టర్ కార్యాలయానికి ఆగంతకల నుంచి విమానాశ్రయం లో బాంబు ఉన్నట్లు సోమవారం ఉదయం గం 10.30నిలకు మెయిల్ వచ్చింది. దీంతో వారు అప్రమత్తమయ్యారు ఇదే విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే విమానాశ్రయానికి చేరుకుని అనుమానం ఉన్న అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.పోలీసులు తనిఖీలు ఎలాంటి బాంబ్ లు కనిపించక పోవడం తో అంతా ఊపిరి పీల్చుకున్న రు.
