ఢిల్లీలోని హర్యానా భవన్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను బిజెపి సీనియర్ నాయకులు ఆనంద్ (నందు) బుధవారం కలిశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయను శాలువాతో సత్కరించారు. గతం లో బండారు దత్తాత్రేయ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన సమయంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆనంద్ వివరించారు.
