సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో గురువారం ఆషాడ బోనాల జాతర పై సమీక్ష నిర్వహించి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ ను సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ కోట నీలిమాతో కలిసి సనత్ నగర్ నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకులు విశాల్ సుధామ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భం గా పొన్నం ను శాలువాతో సత్కరించి బొకే ను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విశాల్ మాట్లాడుతూ బోనాల జాతర ఏర్పాట్లపై మంత్రి పొన్నం ఇప్పటికే పలు సమీక్ష సమావేశాలు నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారని ఆయన నిబద్ధత కలిగిన నేత అని, విశాల్ సుధామ ఆన్నారు.ఆయన్ను కలుసుకోవడం తనకి ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ పొన్నం పై ఉంచాలని కోరుకున్నాను అని అన్నారు.
