కాజీపేట బైపాస్ లైన్, సికింద్రాబాద్‌ – కాజీపేట సెక్షన్ పనులను తనిఖీ చేసినదక్షిణమధ్య రైల్వే జీ ఎమ్ అరుణ్ కుమార్ జైన్ …అంచనా వ్యయం రూ . 125 కోట్లు…

కాజీపేట బైపాస్ లైన్ సికింద్రాబాద్ కాజీపేట సెక్షన్ పనులను గురువారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పరిశీలించారు. 125 కోట్లకు పైగా నిధులతో 21.4 కిలోమీటర్ల కాజీపేట బైపాస్ లైన్ నిర్మాణం చేస్తున్నట్లు అరుణ్ కుమార్ జైన్ తెలియజేశారు. కాజీపేట బైపాస్ లైన్ పనులు కాజీపేట వరంగల్ స్టేషన్ల పునరాభివృద్ధి పనులను గురువారం దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ భరతేష్ కుమార్ జైన్ మరియు ఇతర ఉన్నతాధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ జోన్ లో రైళ్ల రద్దీని సులభతరం చేయడానికి ప్లాన్ చేసిన ప్రధాన బైపాస్ లైన్ లో కాజీపేట బైపాస్ లైన్ ఒకటి అని అన్నారు. దక్షిణ మధ్య రైల్వేలలో కాజీపేట ప్రధాన జంక్షన్ స్టేషన్. ఈ జంక్షన్ సికింద్రాబాద్ న్యూఢిల్లీ ,చెన్నై, హౌరా మధ్య రైళ్లను కలుపుతుంది అని అన్నారు.
ఈ సెక్షన్ లో సంవత్సరాల తరబడిగా రైళ్ల రాకపోకలలో రద్దీ నెలకొంటుంది. దీనివల్ల ఈ సెక్షన్లో విపరీతమైన ఒత్తిడి నెలకొంటుంది. ఈ విభాగంలో రైళ్లు కదలికను మరింత సులభతనం చేయడానికి, దాన్ని పెంచడానికి బైపాస్ లైన్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. 125 కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో 21.47 కిలోమీటర్ల నిడివితో ఈ బైపాస్ లైన్ నిర్మిస్తున్నామన్నారు ఈ ప్రాజెక్టులో భాగంగా రైలు కింద రైల్ ఆర్ యు ఆర్ మూడు ప్రధాన వంతెనలు ,మరియు 31 చిన్న వంతెనలు నిర్మాణం చేయనున్నామన్నారు. ఇది పూర్తయిన తర్వాత అన్ని వైపులా రైళ్ల కదలికలను సులభతరం చేస్తుంది అన్నారు. ముఖ్యంగా హసన్పర్తి రోడ్ వరంగల్ హసన్పర్తి రోడ్ కాజీపేట రైల్వే స్టేషన్ మధ్య
రైళ్ల రాకపోకలను మరింత సులభతరం చేస్తుంది అని రైల్వే జీ ఎం తెలియజేశారు. త్వరితగతిన ఈ పనులను పూర్తిచేసి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అంతకుముందు అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్ నుండి కాజీపేట సెక్షన్ వర్క్ వరకు గల రైలు మార్గాన్ని లోకో క్యాబిన్లో ప్రయాణిస్తూ తనిఖీ చేశారు ఈ తనిఖీల్లో భాగంగా మార్గమధ్యంలో ఉన్న ట్రాక్, వంతెనలు, మరియు సిగ్నలింగ్, వ్యవస్థల నిర్వహణ సంబంధించిన భద్రత అంశాలను పరిశీలించారు రైలు నడుస్తున్నప్పుడు లోకో క్యాబిన్లో ఉన్న లోకో డ్రైవర్లు మరియు ఇతర సిబ్బంది నిర్వహిస్తున్న విధుల తీరును వారు పాటిస్తున్న అప్రమత్తతని ఆయన పరిశీలించారు. ఆయన లోకో క్యాబిన్లో అందుబాటులో ఉన్న భద్రతకు సంబంధించిన లిటరేచర్ మరియు అత్యవసర పరికరాల ను తనిఖీ చేశారు. విధి నిర్వహణలో ఉన్న అసిస్టెంట్ డ్రైవర్ తో ఆయన సంభాషించారు. తాజా భద్రతా సర్కిలర్లపై వారికున్న పరిజ్ఞానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాజీపేట వరంగల్ రైల్వే స్టేషన్లో పునరాభివృద్ధి పనులను పరిశీలించారు ఈ రెండు స్టేషన్లో అమృత భారత స్టేషన్స్ స్కీములో ఉన్నాయి .ఈ స్టేషన్లో వ్యాపార పరంగా స్థానిక అభివృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి పరిచేందుకు సుందరమైన నిర్మాణాలతో ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలను అందించడానికి పునరాభివృద్ధి చేయబడుతున్నాయి అన్నారు. రైలు ప్రయాణికుల సౌలభ్యతకు నిర్నిత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా స్టేషన్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని జిఎం అధికారులను ఆదేశించారు జనరల్ మేనేజర్ కాజీపేట స్టేషన్లోని గ్రూప్ బుకింగ్ లాగి రన్నింగ్ రూమ్ లను కూడా పరిశీలించారు లోకో పైలట్లతో ఆయన నేరుగా సంభాషించారు లోకో రన్నింగ్ సిబ్బంది మరియు గార్డులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు సౌకర్యాలను మరింత మెరుగుపరచడం కోసం వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *